Most viewed Wikipedia articles on January 1 , 2023

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

Views: 2.3k

డాక్టర్ రాజశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు. ఇతని మొదటి చిత్రం వందేమాతరం.

Views: 803

నూతన సంవత్సర రోజు, సంస్కృతి ఒక సంవత్సరం ముగింపు తరువాత మరుసటి సంవత్సర ప్రారంభ రోజు జరుపుకునే ఒక వేడుక.జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకుంటాం న్యూ ఇయర్ గా డేగా ప్రపంచం అంతటా సంబరాలు జరుపుకుంటారు.అన్ని నూతన సంవత్సర వేడుకల సంస్కృతికి కొలమానం వార్షిక క్యాలెండర్లు.

Views: 697

భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

Views: 685

భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

Views: 589

అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య, అప్ప అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్ లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.

Views: 528

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.

Views: 505

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

Views: 501

సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.

Views: 501

కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు.

Views: 500

యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది.

Views: 448

సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

Views: 426

జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మేషము, మీనము మొదలగు రాశులు.

Views: 406

గోల్కొండకోట, ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

Views: 381

బంగారు మామ 1992లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ కింద నందిగాం సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, మీనా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి లు సంగీతాన్నందించారు.

Views: 353

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.

Views: 324

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

Views: 320

భారతదేశంలో ప్రాథమిక హక్కులు

Views: 316

శ్రీలీల భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ నటి. విజయవంతమైన తెలుగు, కన్నడ చిత్రాలలో నటించిన ఆమె 2019లో కిస్‌ చిత్రంతో అరంగేట్రం చేసింది. దీనికిగాను SIIMA అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – కన్నడ ఆమెకు వరించింది. ఆ తరువాత భరతే (2019), పెళ్లి సందD (2021), బై టూ లవ్ (2022) వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.

Views: 301

నవగ్రహాలు అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు.

  1. ఖగోళ శాస్త్రములో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడం ఉచితం.
  2. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో జీవితాలపైనా, ఘటనలపైనా ప్రభావం చూపే గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకూ, ఈ నవ గ్రహాలకూ కొంత భేదం ఉంది. సూర్యుడు, చంద్రుడు .కానీ.,మన ఈ జ్యోతీశ్య శాస్త్రంలో & సంప్రదాయంలో సూర్య, చంద్రులు కూడా గ్రహాలుగా పరిగణింప బడుతాయి !యురేనస్, నెప్ట్యూన్ లు మన ఈ శాస్త్రం లెక్కలోకి రావు. కాని, రాహువు, కేతువు అనే రెండు ఛాయా గ్రహాలను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా గణిస్తారు.
Views: 286

తెలంగాణ ఉద్యమంభాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.

Views: 272

హనుమాన్ చాలీసా,. ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది. దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి.

Views: 272

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

Views: 271

చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. చార్మినార్ 431 సంవత్సరాలకు పైగా పై అంతస్తులో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది. హైదరాబాద్ లోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఇక్కడ ఈద్-ఉల్-అజ్, ఈద్-ఉల్-ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు.

Views: 264

మట్టి కుస్తీ తెలుగులో విడుదల కానున్న సినిమా. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై తమిళంలో గట్ట కుస్తీ పేరుతో, తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించిన ఈ సినిమాకు చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 20న విడుదల చేసి, సినిమా డిసెంబరు 2న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై,జనవరి 1న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.

Views: 260

తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

Views: 255

భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం.

Views: 251

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చిక, ధనూరాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

Views: 250

మన్మథుడు హిందూ పురాణాలలో ప్రేమకు సంబంధించిన దేవుడు. ఇతని భార్య రతీదేవి.

Views: 240

జనవరి 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి.

Views: 227

ఇంటింటి భాగవతం 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మ ప్రభు ఫిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శ్రీవిద్య, తులసి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి వాసూరావు సంగీతాన్నందించాడు.

Views: 223

వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. సి పి బ్రౌన్ చెప్పిన ప్రకారం ఇతన జంగమ కులానికి చెందిన శివకవి. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు.

Views: 220

జనవరి 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 2వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 363 రోజులు మిగిలినవి.

Views: 219

రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.

Views: 217

కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు. శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.

Views: 217

ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులలో ఉంది.

Views: 216

సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు. దీన్ని సౌర వ్యవస్థ అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి గ్రహాలు. మిగతావి మరుగుజ్జు గ్రహాల వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువులు సహజ ఉపగ్రహాలు. వీటిలో రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి.

Views: 214

తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.

Views: 205

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతం లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు సా.శ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది.. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధం.

Views: 203

ఝాన్సీ లక్ష్మీబాయి pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం "జోన్ ఆఫ్ ఆర్క్" గా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.

Views: 202

అల్లూరి సీతారామరాజు, భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

Views: 201

తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. దీనిని మాట్లాడే ప్రజలు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణాలో ఉన్నారు. ఇది ఆ రాష్ట్రాలలో అధికార భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు ఇది కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో ఇది ఒకటి.

Views: 201

వైద్యుడు అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.

Views: 199

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు.

Views: 197

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

Views: 192

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది.

Views: 189

అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే.

Views: 188

ఇద్దరు దొంగలు 1984, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ సమర్పణలో కె. నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె.రాఘవేంద్రరావు దర్శతక్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, రాధ, జయసుధ, శారద తదితరులు నటించగా కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

Views: 182

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు.

Views: 181


శ్రీనాథుడు (1365–1441) 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు.

Views: 180

గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

Views: 175

భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

Views: 175

సంవత్సరానికి ఆరు ఋతువులు: అవి

  1. వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం. - చెట్లు చిగురించి పూలు పూస్తాయి
  2. గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం. - ఎండలు మెండుగా ఉంటాయి
  3. వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. - వర్షాలు ఎక్కువుగా ఉంటాయి.
  4. శరదృతువు: ఆశ్వయుజమాసం, కార్తీకమాసం. - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.
  5. హేమంతఋతువు: మార్గశిరమాసం, పుష్యమాసం. - మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది
  6. శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం.- చెట్లు ఆకులు రాల్చును.
Views: 168

వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం.ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.

Views: 167

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. కాకతీయ గణపతిదేవుడు, పాలకుడైన జయాపసేనాని సోదరీమణులైన నారంభ, పేరాంభలను వివాహ మాడినాడు. వీరి ముద్దుల కుమార్తె రుద్రమదేవి. చేబ్రోలు శాసనం దీని గురించి తెలియజేస్తుంది. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవద్యపుర ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మ.

Views: 167

కాబట్టి మిమ్మును బట్టి ఆకాశము కూరవక వున్నది భూమి పండక ఉన్నదు

Views: 166

ద్రౌపది ముర్ము ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో NDA ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

Views: 164

వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రంలో రెండవ రాశి.. కృత్తికా నక్షత్రంలోని మూడు పాదాలు, రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు, మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభరాశిగా వ్యవహరిస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. ఇది ఆంగ్ల మాసంలో మే మాసం సగము నుండి జూన్ మాసం సగము భాగం వరకు ఉంటుంది. వృషభ రాశి గురించి మరింత సమాచారం కోసం https://dasamiastro.com/taurus-in-telugu/ ఈ లింక్ ని క్లిక్ చేసి చూడగలరు.

Views: 162

మదర్ థెరీసా, ఆగ్నీస్ గోక్షా బొజాక్షు, గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.

Views: 161

సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.

Views: 161

సరోజినీ నాయుడు భారత కోకిల గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

Views: 158

భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.

Views: 156

భవిష్యత్తులో మన ఆరోగ్యానికి, వ్యాపారాలకి, ఆస్థులకి ఏమి ఆపదలు వస్తాయో ఊహించటం కష్టం. మనకు, మన కుటుంబాలకి ధన నష్టం కలిగే అవకాశాల నుండి రక్షణ పొందడాన్ని బీమా (Insurance) చేయటం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే అనుకోని విపత్తు లకు బీమా సంస్థ అందజేసే ధన సహాయమే బీమా.

Views: 155

భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దంలో బుడతగీచు (పోర్చుగీసు) వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. వీరు మన దేశ స్వాతంత్ర్యం కోసం చాలా పోరాడారు.

Views: 153

చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.

Views: 150

క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ లేక నేటివిటీ ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది.

Views: 148

నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

Views: 146

రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు.

కాలుష్యం - మెర్రియం - వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువు నుండి తీసుకున్న వివరణ.]</ref> కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.కాలుష్యం తర‌‌చుగా మూల కేంద్ర కాలుష్యం లేదా మూల కేంద్రం లేని కాలుష్యం అని విభజింపబడుతుంది. 
Views: 144

అలంకారము వ్యాకరణంలో ఒక భాగము.

Views: 144

భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు.

Views: 144

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.

Views: 143

నన్నయ భట్టారకుడు తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.

Views: 141

[[File:Street tiger dance-andhrq.jpg|thumb|right|200px|ప ]

Views: 140

1857–-58 లో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అంటారు. ఈ తిరుగుబాటు, వైఫల్యంతో ముగిసింది. 1857 మే 10 న మీరట్‌లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది. తూర్పు భారత దేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి. ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిషు వారి అధికారాన్ని పెద్దయెత్తున సవాలు చేసింది. 1858 జూన్ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది. హత్యలకు పాల్పడని వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిషు ప్రభుత్వం 1858 నవంబరు 1 న క్షమాభిక్ష మంజూరు చేసింది. యుద్ధం ముగిసినట్లు ప్రకటించినది మాత్రం 1859 జూలై 8 న. ఈ తిరుగుబాటును సిపాయీల తిరుగుబాటు, భారతీయ తిరుగుబాటు, గొప్ప తిరుగుబాటు, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుత్థానం, మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం అని అనేక పేర్లతో పిలుస్తారు.

Views: 140

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు, నలుసు పదార్థము లు, లేక జీవపదార్దము లు వాతావరణము లో కలియుట వాయు కాలుష్యము అనబడును.

Views: 139

'బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

Views: 139

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చదివే పవిత్ర గ్రంథం బైబిలు. దీనిని పరిశుద్ధ గ్రంథమని కూడా అంటారు. బైబిల్ అనగా గ్రీకు భాషలో వైదిక గ్రంథాల సంహిత. బైబిలు గ్రంథము వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 ప్రవక్తలు 1400 సంవత్సరాల పాటూ వ్రాయబడింది. బైబిల్ లో మూడు రకములు ఉన్నవి - హెబ్రియ బైబిలు, గ్రీకు బైబిలు, క్రిస్టియన్ బైబిలు.

Views: 139

రవితేజ తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

Views: 138

శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దొచుకున్నవాడిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.

Views: 138

కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ3. నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలో కెల్లా నాలుగవ పెద్ద నది. తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో, సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1, 400 కి. మీ. ప్రయాణించి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

Views: 137

తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు.

Views: 137

వేంకటేశ్వరుడు, లేదా వేంకటాచలపతి, శ్రీనివాసుడు. విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు.వేం = పాపాలు, కట = తొలగించే, ఈశ్వరుడు = దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది.

Views: 133

హర్యానా, భారతదేశ ఉత్తర భాగంలో ఉన్న ఒక రాష్ట్రం. ఇది భాషా ప్రాతిపదికన 1966 నవంబరు 1న పూర్వపు తూర్పు పంజాబ్ రాష్ట్రం నుండి వేరు చేయబడింది. ఇది భారతదేశ భూభాగంలో 1.4% కంటే తక్కువ విస్తీర్ణంతో 21వ స్థానంలో ఉంది. రాష్ట్ర రాజధాని చండీగఢ్, ఇది పొరుగు రాష్ట్రం పంజాబ్‌తో సరిహద్దు పంచుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన నగరం ఫరీదాబాద్, ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో భాగమైంది. గురుగ్రామ్ నగరం భారతదేశ అతిపెద్ద ఆర్థిక, సాంకేతిక కేంద్రాలలో ఒకటి. హర్యానాలో 6 పరిపాలనా విభాగాలు, 22 జిల్లాలు, 72 ఉప-విభాగాలు, 93 రెవెన్యూ తహసీల్‌లు, 50 ఉప-తహసీల్‌లు, 140 కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, 154 నగరాలు, పట్టణాలు, 7,356 గ్రామాలు, 6,222 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హర్యానాలో 32 ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి, ఇవి ప్రధానంగా జాతీయ రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులలో ఉన్నాయి. గుర్గావ్ భారతదేశంలోని ప్రధాన సమాచార సాంకేతికత, ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. హర్యానా మానవ అభివృద్ధి సూచికలో భారతీయ రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉంది.

Views: 133

గౌతము బుద్ధుడు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు. 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ. 563 నుండి 483 మధ్యలో జననం అని, క్రీ.పూ 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మిగతా లెక్కలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.

Views: 133

విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

Views: 132

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము, సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

Views: 131

Happy new year 2023

Views: 129

వాల్తేరు వీరయ్య - ఇది బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ లు కథానాయకుడు, కథానాయికగా నటించిన చిత్రం. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కాగా జీకే మోహన్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేయగా, సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న విడుదలైంది.

Views: 129

జవాహర్ లాల్ నెహ్రూ, భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

Views: 129

తిరుమల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తుంది, ఇది టిటిడి అధిపతిని కూడా నియమిస్తుంది, పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తుంది.

Views: 128

గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యుడి తాలూకు విత్తనానికి జన్మనిచ్చేది పురుషుడే కాబట్టి, గోత్రం మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. గోత్రం అనగా గో అంటే గోవు, గురుడు, భూమి, వేదం అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.

Views: 128

[[File:potter job.jpg|thumb|right|కుండలు తయారు చేస్తున్న మహిళలు]] 'కుమ్మరి కులం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కులాల, శాలివాహన ప్రజాపతి పేర్లతో కూడా పిలుస్తారు. మట్టితో కుండలను చేయువానిని కుమ్మరి (Potter) అంటారు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్మరం (Pottery) అని అంటారు. ఈ వృత్తి వారసత్వముగా వచ్చునది. దీనిని చేయుటకు తగిన అనుభవము ఉండవలెను. మట్టి గురించి అవగాహన, చేయుపనిలో శ్రద్ధ, కళాదృష్టి లాంటివి ఈ పనికి తప్పనిసరి. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు.

Views: 127

చేగొండి వెంకట హరిరామజోగయ్య భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.

Views: 126

2018 జనవరి నాటికి, భారత రాజ్యాంగంలో 123 సవరణ ప్రతిపాదనలు, 101 సవరణ చట్టాలు జరిగాయి. మొట్టమొదటి సవరణను1950 లో ప్రవేశపెట్టారు.

Views: 126

విజయశాంతి తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్", "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి. ఆమె అగ్నిపర్వతం (సినిమా), ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు (సినిమా), గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.

Views: 126

కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ వ్యాసారంగమ్లో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టాడు.

Views: 125

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్(నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రియైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీ కి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.

Views: 125
    main(): 1x 0.23717617988586s
index: 1x 0.23657989501953s
t_/pages/daily-top-views: 1x 0.23353099822998s
t_/blocks/list: 1x 0.2267119884491s
router_page: 1x 0.0026659965515137s
t_/common/header: 1x 0.0012688636779785s
loading-2: 1.5x 0.0011708736419678s
t_/common/head: 1x 0.0010268688201904s
t_/common/footer: 1x 0.00016188621520996s
t_/content/select: 1x 6.7949295043945E-5s
----- END OF DUMP (2024-12-03 14:39:12)  -----