Most viewed Wikipedia articles on January 8 , 2023

బింబిసారుడు జైన చరిత్రలలో సెనియా లేదా శ్రేనికా అని కూడా పిలుస్తారు మగధ రాజు (r క్రీ.పూ.543 - క్రీ.పూ.492 హర్యంక రాజవంశానికి చెందినవారు. ఆయన భట్టియా కుమారుడు. . ఆయన రాజ్యం విస్తరణ తరువాత మౌర్య సామ్రాజ్యం విస్తరణకు పునాదులు వేసినట్లు భావిస్తారు.

Views: 1.8k

సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.

Views: 944

సింహం ఒక కౄర జంతువు. మృగాలకు రాజుగా 'మృగరాజు' అని సింహాన్ని పిలుస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 నుంచి 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 నుంచి 8 అడుగులు, బరువు 150 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది.

Views: 768

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

Views: 716

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చిక, ధనూరాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

Views: 687

కె.ఎస్.రవీంద్ర భారతీయ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినిమా స్క్రీన్ రైటర్ కూడా అయిన అతను బాబీగా ప్రసిద్ధి. అతను సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో పవర్ (2014)కి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నాడు.

Views: 570

భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

Views: 563

కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు.

Views: 532

భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

Views: 518

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.

Views: 412

గోల్కొండకోట, ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

Views: 384

యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది.

Views: 366

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.

Views: 357

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు.

Views: 352

వాల్తేరు వీరయ్య - ఇది బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ లు కథానాయకుడు, కథానాయికగా నటించిన చిత్రం. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కాగా జీకే మోహన్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేయగా, సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న విడుదలైంది.

Views: 348

భారతదేశంలో ప్రాథమిక హక్కులు

Views: 343

సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.

Views: 334

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

Views: 321

చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. చార్మినార్ 431 సంవత్సరాలకు పైగా పై అంతస్తులో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది. హైదరాబాద్ లోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఇక్కడ ఈద్-ఉల్-అజ్, ఈద్-ఉల్-ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు.

Views: 319

భోగిమంటలు సినిమా కొరకు చూడండి భోగిమంటలు (సినిమా)


Views: 311

సింధు లోయ నాగరికత ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదటగా వెలికి తీయుటచే ఇది సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధు నాగరికత మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.

Views: 288

తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.

Views: 288

వాల్తేరు శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సంతకవిటి నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజాం నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 621 ఇళ్లతో, 2279 జనాభాతో 164 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1104, ఆడవారి సంఖ్య 1175. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 94 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581306.పిన్ కోడ్: 532168.

Views: 278

తెలంగాణ ఉద్యమంభాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.

Views: 273

కొంగ ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధ్రువప్రాంతాలు, దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.

Views: 262

శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ..పూ. 230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. శాతవానుల తొలి రాజధాని కోటిలింగాల. కాని కొందరు చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ఆంధ్రప్రదేశ్ లోని ధాన్యకటకం (అమరావతి) అని అభివర్ణిస్తున్నారు వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.

Views: 258

భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.

Views: 256

మనసు - మమత 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, సితార జంటగా నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.

Views: 247

భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం.

Views: 247

కపోతం ఒక రకమైన పక్షి. ఇవి కొలంబిఫార్మిస్ క్రమంలోకొలంబిడే కుటుంబానికి చెందినవి. వీటిలో సుమారు 300 జాతులు ఉన్నాయి. వీటిలో పెద్దగా ఉండే జాతులను కపోతాలు అని, చిన్నగా ఉండే జాతులను పావురాలు అని అంటారు పావురం (Dove) 'శాంతి'కి చిహ్నం.

Views: 246

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.

Views: 245

2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయింది. కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయా పథకాలకు జాబితాకు సంబంధించిన సమాచారం.

Views: 244

చిలుక ఒక రంగులతో ఆకర్షణీయంగా వుండే పక్షి. దీనిని పెంపుడు జంతువుగా కొంతమంది పెంచుతారు. సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు. వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు, కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

Views: 244

1987లో వచ్చిన తెలుగు సినిమా కోసం అరణ్యకాండ (సినిమా) చూడండి.

Views: 233

ప్రభాస్ శ్రీను ఒక తెలుగు సినీ నటుడు. 150 కి పైగా సినిమాల్లో కామెడీ, నెగటివ్ పాత్రలలో నటించాడు.

Views: 232

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

Views: 232

హనుమాన్ చాలీసా,. ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది. దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి.

Views: 229

రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.

Views: 226

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. కాకతీయ గణపతిదేవుడు, పాలకుడైన జయాపసేనాని సోదరీమణులైన నారంభ, పేరాంభలను వివాహ మాడినాడు. వీరి ముద్దుల కుమార్తె రుద్రమదేవి. చేబ్రోలు శాసనం దీని గురించి తెలియజేస్తుంది. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవద్యపుర ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మ.

Views: 223

కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.

Views: 217

ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులలో ఉంది.

Views: 215

ఝాన్సీ లక్ష్మీబాయి pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం "జోన్ ఆఫ్ ఆర్క్" గా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.

Views: 214

సూర్యకుమార్ యాదవ్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2011 అక్టోబరులో ముంబై తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, ఐపీఎల్ 2012లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆయనను ఐపీఎల్ 2014 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకొని, తిరిగి 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 2021లో భారత క్రికెట్ జట్టులో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేసి వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.

Views: 214

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది.

Views: 211

చిరంజీవి తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి గా పనిచేశాడు. తన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.

Views: 208

తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

Views: 206

Happy new year 2023

Views: 206

నెమలి భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.

Views: 205

వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం.ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.

Views: 205


శ్రీనాథుడు (1365–1441) 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు.

Views: 203

తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. దీనిని మాట్లాడే ప్రజలు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణాలో ఉన్నారు. ఇది ఆ రాష్ట్రాలలో అధికార భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు ఇది కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో ఇది ఒకటి.

Views: 197

దేవేంద్రుడు హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ,, స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి. ఇతని వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు. ఇతని భార్య శచీదేవి. వీరి కూతురు జయంతి, కొడుకు జయంతుడు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.

Views: 195

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు.

Views: 194

రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయిన ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనుదనికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

Views: 194

నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

Views: 189

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతం లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు సా.శ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది.. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధం.

Views: 186

శ్రీలీల భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ నటి. విజయవంతమైన తెలుగు, కన్నడ చిత్రాలలో నటించిన ఆమె 2019లో కిస్‌ చిత్రంతో అరంగేట్రం చేసింది. దీనికిగాను SIIMA అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – కన్నడ ఆమెకు వరించింది. ఆ తరువాత భరతే (2019), పెళ్లి సందD (2021), బై టూ లవ్ (2022) వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.

Views: 184

యమున దక్షిణ భారత సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది. ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.

Views: 182

చెంఘీజ్ ఖాన్, సా.శ. 1162 - 1227 –1227) మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు, ఖాన్, పరిపాలకుడు, మంగోల్ సామ్రాజ్య పరిపాలకుడు, 'ఖాగన్' లేదా ఖాఖాన్ అని పిలువబడ్డాడు. ఆయన పునాదివేసిన మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం. ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచారజాతికి చెందినవాడు. ఇతడి అసలు పేరు "టెమూజిన్" ), 'చెంఘీజ్ ఖాన్' అని తనకు తాను ప్రకటించుకున్నాడు. ఇతడు షామనిజం మతానికి చెందిన వాడు. షామనిజం మతంలో పితృదేవతాత్మలను పూజిస్తారు, వీరినే దేవతలుగా కొలుస్తారు. ఇతని పేర్లు; 'చంగేజ్ ఖాన్, చంఘీజ్ ఖాన్, చంఘేజ్ ఖాన్, మొదలగునవి.

Views: 182

కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు. శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.

Views: 182

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు, నలుసు పదార్థము లు, లేక జీవపదార్దము లు వాతావరణము లో కలియుట వాయు కాలుష్యము అనబడును.

Views: 181

కాకి ఒక నల్లని పక్షి. దీనిని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి కార్విడే కుటుంబానికి చెందిన కూత పక్షులు. ఇవి కావ్ కావ్ అని కూస్తుంటాయి. వీటిని మామూలు పక్షుల వలె ఇళ్ళలో పెంపకానికి వాడుట జరుగదు.

Views: 178

తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. 

Views: 176

వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Views: 176

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు 26. లోకసభ నియోజకవర్గం ప్రాంతం ఒకే జిల్లాప్రాతిపదికన గతంలో గల 13 జిల్లాలను, జిల్లాల పునర్య్వస్థీకరణతో 26 జిల్లాలుగా చేసారు.అయితే జనసాంద్రత తక్కువగా వుండే షెడ్యూల్ తెగల అరకు లోకసభ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించారు.

Views: 176

నన్నయ భట్టారకుడు తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.

Views: 175

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

Views: 175

సరోజినీ నాయుడు భారత కోకిల గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

Views: 173

కుక్క మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు.భారత్ లో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావించెదరు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది.

Views: 173

రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు.

కాలుష్యం - మెర్రియం - వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువు నుండి తీసుకున్న వివరణ.]</ref> కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.కాలుష్యం తర‌‌చుగా మూల కేంద్ర కాలుష్యం లేదా మూల కేంద్రం లేని కాలుష్యం అని విభజింపబడుతుంది. 
Views: 168

వాతావరణం : : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు. ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.

Views: 168

వీర సింహా రెడ్డి 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, శృతి హాసన్,హనీ రోజ్ శ్రీలీల, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 5 విడుదల చేయగా, సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదలైంది.

Views: 167

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ప్రభుత్వాధీనంలోని సంస్థ. సింగరేణి, పరిసర గోదావరీ లోయలో బొగ్గు గనుల త్రవ్వకాలు, పంపిణి మొదలైనవి దీని పని.

Views: 167

నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చెయ్యడం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భజలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు, తగినంతగా శుద్ధి చేయని మురుగునీటిని సహజ జలాల్లోకి విడుదల చేయడం జల పర్యావరణ వ్యవస్థల క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఈ నీటిపి ఆధారపడి నివసించే వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వారు అదే కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటిపారుదల కొరకు ఉపయోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వ్యాధులకూ నీటి కాలుష్యం ప్రధాన కారణం.

Views: 162

జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మేషము, మీనము మొదలగు రాశులు.

Views: 162

2018 జనవరి నాటికి, భారత రాజ్యాంగంలో 123 సవరణ ప్రతిపాదనలు, 101 సవరణ చట్టాలు జరిగాయి. మొట్టమొదటి సవరణను1950 లో ప్రవేశపెట్టారు.

Views: 162

జనవరి 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 8వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 357 రోజులు మిగిలినవి.

Views: 161

సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

Views: 157

'బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

Views: 157

ద్రౌపది ముర్ము ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో NDA ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

Views: 156

పిచ్చుక ఒక చిన్న పక్షి.

Views: 155

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలు.

Views: 154

పక్షులు రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. తెలుగు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం నిర్వహించబడుతుంది.

Views: 154

నాణెం అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి.

Views: 154

తులసి లేదా తులసి శివమణి తెలుగు సినిమా నటి. తులసి తల్లి సినీ నటీమణులు అంజలీదేవికి, సావిత్రికి మంచి స్నేహితురాలు. వీరు తులసి వాళ్ళ ఇంటికి తరచూ వస్తుండేవారు. అప్పట్లో తులసి చురుకైన పిల్ల అని గమనించి సినీరంగములో బాగా రాణించగలదని అనుకున్నారు. భార్య సినిమా నిర్మాత ఒక బాల్యనటి కోసం వెతుకుతుండగా, వాళ్ళు తులసిని ఆ పాత్రకై సిఫారుసు చేశారు. అప్పటి నుండి అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ సినిమా షూటింగు సందర్భములో దాసరి నారాయణరావు తులసి యొక్క నటన నచ్చి, ఇతర నిర్మాతలకు కూడా రికమెండ్ చేశాడు.

Views: 154

గోపీచంద్ మలినేని తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. డాన్ శీను సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.

Views: 151

తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు.

Views: 151

మూస:నిర్వహనదక్షులు

Views: 151

హిందూ మతం ముఖ్యంగా ఉండే తెలుగు సమాజంలో కులాలు వృత్తులను అనుసరించి నిర్ణయించబడ్డాయి.

Views: 149

జనవరి 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 9వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 356 రోజులు మిగిలినవి.

Views: 148

హనీ రోజ్ వరగేసే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా సినిమాల్లో నటించి నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి107వ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

Views: 148

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు.

Views: 148

గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

Views: 146

జవాహర్ లాల్ నెహ్రూ, భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

Views: 146

పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.

Views: 146

హాథీగుంఫా శాసనం క్రీ. పూ 2వ శతాబ్దంలో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో ఉదయగిరి గుహలలో అప్పటి కళింగ పాలకుడు ఖారవేలుడు చెక్కించిన శిలాశాసనం. ఇది ఉదయగిరి కొండల్లో దక్షిణం వైపున ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ హాథీగుంఫా అనే గుహలో రాతిపై ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో 17 వరుసల్లో చెక్కబడి ఉంది.

Views: 143
    main(): 1x 0.76132297515869s
index: 1x 0.76071691513062s
t_/pages/daily-top-views: 1x 0.75472187995911s
t_/blocks/list: 1x 0.74781012535095s
router_page: 1x 0.005620002746582s
t_/common/header: 1x 0.0014519691467285s
t_/common/head: 1x 0.0011880397796631s
loading-2: 1.5x 0.0010230541229248s
t_/common/footer: 1x 0.00016283988952637s
t_/content/select: 1x 6.103515625E-5s
----- END OF DUMP (2024-10-22 06:46:10)  -----