Most viewed Wikipedia articles on December 4 , 2023

ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు.

Views: 8.9k

కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

Views: 5.9k

తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడవ తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 డిసెంబరులో లేదా అంతకుముందుగానీ జరగాల్సివుంది. భారత రాష్ట్ర సమితికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

Views: 4.0k

ఆంధ్రజ్యోతి ఒక తెలుగు దినపత్రిక. సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.

Views: 3.9k

తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. దీనిని మాట్లాడే ప్రజలు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణాలో ఉన్నారు. ఇది ఆ రాష్ట్రాలలో అధికార భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు ఇది కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో ఇది ఒకటి.

Views: 2.6k

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ రావు 14వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. 2018 డిసెంబరు 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, డిసెంబరు 13 గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్‌ భవన్‌లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టాడు.

Views: 2.1k

మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మధిర శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2009, 2014 ఎన్నికలలో శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2009 నుండి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా ఉన్నాడు, 2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశాడు.

Views: 2.1k

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్(నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రియైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీ కి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.

Views: 1.5k

మైనంపల్లి రోహిత్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్‌ఫ్లూయన్సర్. ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

Views: 1.4k

త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

Views: 1.2k

ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణ కు చెందిన రాయకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు.

Views: 1.2k

భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం అధికారంలో ఉన్న పార్టీ. ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకేఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు.

Views: 1.0k

కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడు. ఈయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.

Views: 1.0k

ప్రేమ పావురాలు 1989లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీని మాతృక హిందీ చిత్రం మైనే ప్యార్ కియా.

Views: 1000

తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, జర్నలిస్టు.

Views: 918

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతను 1963 మే 23న జన్మించాడు. 1999, 2004, 2009, 2014లలో నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడూ ఇతనే. వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పనిచేశాడు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రిపదవికి రాజీనామా చేయగా గవర్నరు 2011 అక్టోబరు 5న ఆమోదించాడు.

Views: 901


పాడి కౌశిక్ రెడ్డి భారతదేశానికి చెందిన క్రికెటర్ మరియు రాజకీయ నాయకుడు. ఆయన నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు. ఆయన ఈ పదవిలో 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతాడు.

Views: 856

మైనంపల్లి హన్మంతరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

Views: 854

తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.

Views: 755

ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 పత్రిక అమ్మకాలతో దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

Views: 703

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తారు.రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. శాసనసభ ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది.ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటీ సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.

Views: 650

డీ.కే. శివ కుమార్‌ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు.

Views: 639

మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. ఈయన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (దుండిగల్), మరికొన్ని విద్యాసంస్థలకు చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మర్రి రాజశేఖర్‌రెడ్డి 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు.

Views: 637

భీంరావ్ రాంజీ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.

Views: 613

జగ్గారెడ్డిగా ప్రసిద్ధి చెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రాంరంభించి, మున్సిపాలిటి చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్‌గా పదవులు నిర్వహించాడు. 2021, జూన్ 28 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.

Views: 610

మాగంటి గోపీనాథ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Views: 594

శ్రీ కొండా మురళీదర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన Congress మాజీ ఎం.ఎల్.సి., మాజీ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త.

Views: 584

ఆంధ్రప్రదేశ్ లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.

Views: 567

తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.

Views: 555

సి.హెచ్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019 ఫిబ్రవరి 19న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2014లో మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు.

Views: 543

శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి లో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.

Views: 533

వెడ్మ బొజ్జు పటేల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

Views: 533

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

Views: 533

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు. ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా, ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

Views: 530

ప్రగతి భవన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం, నివాసం. ఇది హైదరాబాదులోని పంజాగుట్టలో ఉంది. భారతదేశంలో పేరొందిన వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఈ భవనం రూపొందించబడింది.

Views: 512

భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.

Views: 502

శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) భారత ప్రభుత్వ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్న ప్రతినిధిని శాసన సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు (ఎంఎల్ఎ) అని అంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి, ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.ఎన్నికైన ప్రతినిధులు ఆరాష్ట్ర శాసనసభ సభ్యుడవుతారు.ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. భారతదేశంలో ద్విసభలు ఉండే శాసనసభ సభ్యులు, భారత పార్లమెంటు లోక్‌సభలో ప్రతి పార్లమెంటు సభ్యుడికి (ఎంపి) ప్రతి రాష్ట్రానికి ఏడు నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు.భారత కేంద్రపాలిత ప్రాంతాలైన, ఢిల్లీ శాసనసభ, జమ్మూ కాశ్మీర్ శాసనసభ, పుదుచ్చేరి శాసనసభ ఈ మూడు రాష్ట్రాలలో ఏకసభ్య శాసనసభ సభ్యులు కూడా ఉన్నారు.

Views: 496

ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందినది.

Views: 491

మామిడాల యశస్విని రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023 శాసనసభ ఎన్నికల్లో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

Views: 473

తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యుల తో ఉంది.

Views: 464

దామోదర రాజనర్సింహ 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

Views: 459

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. 2014 నుండి 2019 వరకు ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి 16వ లోకసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.

Views: 454

ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది..

Views: 443

ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ, 2018లో ఆరవసారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు.

Views: 436

తన్నీరు హరీశ్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు. 2019 సెప్టెంబరు 8 నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Views: 435

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నాంపల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2002 నాటి డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 2009 ఎన్నికలకు ముందు నాంపల్లి నియోజక వర్గం ఆసిఫ్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి కొంత భాగం తొలగించబడింది. శాసనసభ నియోజకవర్గం ప్రస్తుతం ఈ క్రింది పొరుగు ప్రాంతాలను కలిగి ఉంది:

Views: 434

భారత దేశములో నౌకాదళ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 4 వ తేదీన జరుపుతారు. దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం, భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. 17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లే "భారత నావికా పితామహుడి"గా భావిస్తారు.

Views: 433

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.

Views: 430

1972, ఏప్రిల్ 17న జన్మించిన ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్. 2007, డిసెంబర్ 4న టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండుతో కాండీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కాలింగ్‌వుడ్ను తన స్పిన్ బౌలింగ్‌తో ఔట్ చేసి తన టెస్ట్ జీవితంలో 709వ వికెట్టు సాధించి ఇంతకు క్రితం ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ సృష్టించిన రికార్డును అధిగమించాడు. షేర్‌వార్న్ 145 టెస్టులు ఆడి నెలకొల్పిన రికార్డును మరళీధరన్ కేవలం 116వ టెస్టులోనే అధిగమించాడు. 2004లోనే మరళీధరన్ అత్యధిక టెస్ట్ వికెట్ల రికార్డును సృష్టించిననూ ఆ వెంటనే షేన్‌వార్న్ అధిగమించాడు. చాలా కాలంపాటు ఈ రికార్డు వీరిద్దరి మధ్య చేతులు మారింది. షేర్‌వార్న్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఇక మరళీధరన్‌కు తిరుగులేకపోయింది. వన్డే క్రికెట్‌లో కూడా అత్యధిక వికెట్ల రేసులో మరళీధరన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2002లో మరళీధరన్ గణాంకపరంగా క్రికెట్ బౌలర్లలో సుప్రసిద్ధుడిగా విజ్డెన్ క్రికెటర్స్ యొక్క అల్మానాక్ ద్వారా గుర్తింపు పొందినాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందిననూ అతని క్రీడాజీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు. బౌలింగ్ శైలిపై పలు మార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు అతను జింబాబ్వే, బంగ్లాదేశ్లపై మాత్రమే ఎక్కువ వికెట్లు సాధించాడని, ఆస్ట్రేలియా, భారత్‌లపై రికార్డు అంతంత మాత్రమేనని విమర్శకుల వాదన. ఏమైననూ క్రీడాప్రపంచం దృష్టిలో అతను గొప్ప బౌలరే.

Views: 421

సోనియా గాంధీ ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో. ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

Views: 421

భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.

Views: 420

అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య, అప్ప అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్ లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.

Views: 411

నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. అతను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.

Views: 401

యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది.

Views: 399

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.

Views: 390

తెలుగు భాష(నుడి)లో అక్షరములుు 60. వీటిని అచ్చులు, హల్లులు(మ్రోవలు), ఉభయాక్షరములుగా విభజించారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 56. 16 అచ్చులు, 41 హల్లులు(మ్రోవలు), (్) పొల్లు, సున్న, అఱసున్న, విసర్గ 60 అక్షరములు. అఱసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు భాగాలుగా విభజించవచ్చును.

Views: 382

సందీప్ రెడ్డి వంగా తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. అర్జున్ రెడ్డి తో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.

Views: 379

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకి మూలస్తంభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాబినెట్.

Views: 377

గడ్డం వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో 2004 నుండి 2009 వరకు కార్మిక, ఉపాది శాఖ మంత్రిగా పని చేశాడు.

Views: 375

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ శాసనసభ్యుడు. అతను తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ శాసనసభకు 2014లో ఎన్నికైనాడు. అతను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గృహ, బలహీన వర్గాల మంత్రిత్వ శాఖలో పనిచేసాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను తెలంగాణ రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా 2015-2021 వరకు పనిచేశాడు

Views: 375

మిజోరం రాష్ట్ర శాసనసభలోని మొత్తం 40 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి 2023 మిజోరం శాసనసభ ఎన్నికలు న‌వంబ‌ర్ 7న నిర్వహించారు. ఎన్నికల కౌటింగ్ డిసెంబర్ 3న జరుగుతుంది. దీంతో మిజోరం రాష్ట్రంలో నోటిఫికేషన్ తేదీ 13 అక్టోబర్ నుండి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.

Views: 366

మాజీ మంత్రి శ్రీమతి శ్రీకొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.

Views: 366

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న, సారవంతమైన ద్వీపం దివిసీమ.

Views: 359

శ్రీలీల భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ నటి. విజయవంతమైన తెలుగు, కన్నడ చిత్రాలలో నటించిన ఆమె 2019లో కిస్‌ చిత్రంతో అరంగేట్రం చేసింది. దీనికిగాను SIIMA అవార్డ్స్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – కన్నడ ఆమెకు వరించింది. ఆ తరువాత భరతే (2019), పెళ్లి సందD (2021), బై టూ లవ్ (2022) వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.

Views: 357

తృప్తి డిమ్రి భారతీయ నటి. హిందీ చిత్రసీమకు చెందిన ఆమె కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017)లో తొలిసారిగా నటించింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది.

Views: 356

బర్రెలక్కగా పేరొందిన కర్నె శిరీష తెలంగాణకు చెందిన నిరుద్యోగి, రాజకీయ నాయకురాలు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్శించింది. ఆమెకు ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, అలాగే, ఆమె పాల్గొనే ఎన్నికల సమావేవాలకు సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 2023 నవంబరు 24న ఆదేశించింది.

Views: 355

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కోరుట్ల శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Views: 349

బిగ్ బాస్ తెలుగు 7 అనేది తెలుగు రియాలిటీ షో. స్టార్ మా ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 7వ సీజన్. 2023, సెప్టెంబరు 3న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ షోకు నాగార్జున హస్ట్‏గా వ్యవహరిస్తున్నాడు. బిగ్‌బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.00 గంటలకు స్టార్ మా లో ప్రసారమవుతోంది.

Views: 345

తల్లోజు ఆచారి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

Views: 344

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రదేశాలలో బలమైన ఉనికి గల పార్టీ. 2004 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ ఒక సీటు గెలుపొందింది. 1984-2004 వరకు ఆ.ఇ.మ.ఇ.ము. పార్టీ అధ్యక్షుడిగా సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఉన్నాడు. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అనంతరం తన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

Views: 344

తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మాజీ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి.ఖమ్మం జిల్లా లోని ఖమ్మం శాసనసభ నియొజక వర్గానికి ప్రాతినిధ్యం వహించాడు .పూర్వం ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి నియొజక వర్గానికి ప్రాతినిధ్యం వహింఛారు .ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాడు. 2014 ఆగస్టు 30న ఇతడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరాడు.

Views: 342

మల్‌రెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ప్రస్తుతం ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా ఉన్నాడు.

Views: 337

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు 26. లోకసభ నియోజకవర్గం ప్రాంతం ఒకే జిల్లాప్రాతిపదికన గతంలో గల 13 జిల్లాలను, జిల్లాల పునర్య్వస్థీకరణతో 26 జిల్లాలుగా చేసారు.అయితే జనసాంద్రత తక్కువగా వుండే షెడ్యూల్ తెగల అరకు లోకసభ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించారు.

Views: 333

దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు భారతీయ రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ఆ రాష్ట్రం విభజించబడటానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. అతను ఇప్పుడు తెలంగాణలో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంథని నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను శాసన సభ్యునిగా ఆయన నాలుగోసారి గెలుపొందాడు. శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో ఒకడు. అతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగము ఉపాధ్యక్షులలో ఒకడు.

Views: 323

కామాక్షి భాస్కర్ల భారతదేశానికి చెందిన సినిమా నటి, డాక్టరు. ఆమె ప్రియురాలు అనే సినిమాతో తెలుగు సినిమారంగంలో అడుగు పెట్టింది. కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో హాస్పిటల్ లో కొంతకాలం డాక్టరుగా పనిచేసింది. ఆ తరువాత ఆమె మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణగా ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది.

Views: 320

ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. అతను తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తొలి ఆర్ధిక మంత్రిగా పని చేశాడు.

Views: 317

ఝాన్సీ లక్ష్మీబాయి pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం "జోన్ ఆఫ్ ఆర్క్" గా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.

Views: 313

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.

Views: 309

కల్వకుంట్ల కవిత భారతదేశ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు. కవిత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2020 నుండి నిజామాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేస్తున్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు.

Views: 306

భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహము రాగం. రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని.

Views: 305

భారత్ రాష్ట్ర సమితి, అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం 2001లో ఏర్పాటుచేయబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు 2022 అక్టోబరు 5న భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది. 2022 డిసెంబరు 9న తెలంగాణ భ‌వ‌న్‌లో జరిగిన భార‌త్ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌ల్లో భాగంగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్, పార్టీ జెండాను ఆవిష్క‌రించాడు.

Views: 304

భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి.

Views: 303

శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు.... అవి...

 1. రామనాథస్వామి లింగం - రామేశ్వరం
 2. శ్రీశైల క్షేత్రం - శ్రీశైలం
 3. భీమశంకర లింగం - భీమా శంకరం
 4. ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు
 5. త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం
 6. సోమనాథ లింగం - సోమనాథ్
 7. నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
 8. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
 9. మహాకాళ లింగం - ఉజ్జయని
 10. వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్)
 11. విశ్వేశ్వర లింగం - వారణాశి
 12. కేదార్‌నాథ్‌ ఆలయం
Views: 301

2023 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

Views: 292

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

Views: 291

అరికెపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్ గా ఉన్నాడు.

Views: 290

గోల్కొండకోట, ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

Views: 288

తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి. ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అదికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి. గతంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఓడించడానికి నాలుగు ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ పార్టీలు కలసి "మహా కూటమి" గా ఏర్పడి పోటీ చేసాయి.

Views: 286

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు.

Views: 286

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు.

Views: 285

రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నాడు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతిఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్.

Views: 284

గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

Views: 281

తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి.

Views: 280

పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. రంగారెడ్డి జిల్లా రాజకీయ నేతలలో ముఖ్యురాలు. 2000, 2004లలో చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, 2009, 2018లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2019 లో టీఆర్ఎస్ పార్టీలో చేరింది.

Views: 278

కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

Views: 270

తెలంగాణ ఉద్యమంభాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.

Views: 267

మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము.

Views: 263

మేళకర్త రాగాలు లేదా సంపూర్ణ రాగాలు లేదా జనక రాగాలు మొత్తం 72 ఉన్నాయి. అనంతమైన జన్య రాగాలు ఈ మేళకర్త రాగాల నుండే జనించాయి. ఇవి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతానికి ప్రాథమిక రాగాలు. ఉత్తరభారత శాస్త్రీయ సంగీతం లో ఠాట్ ఈ మేళకర్తకు సమానకం.

Views: 263

బంగాళాఖాతం హిందూ మహాసముద్రపు ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ, వాయవ్య దిశల్లో భారతదేశం, ఉత్తరాన బంగ్లాదేశ్, తూర్పున మయన్మార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. శ్రీలంక లోని సంగమన్ కందా కు, వాయవ్య కొన వద్ద ఉన్న సుమత్రా (ఇండోనేషియా) కూ మధ్య ఉండే రేఖ, బంగాళాఖాతానికి దక్షిణ సరిహద్దు. ఇది, అఖాతం అని పిలువబడే నీటి ప్రాంతాల్లో ప్రపంచంలో కెల్లా అతి పెద్దది. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని కళింగ సాగర్ అనేవారు. తరువాత బ్రిటిషు భారతదేశంలో, చారిత్రాత్మక బెంగాల్ ప్రాంతంలోని కలకత్తా రేవు, భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యానికి ముఖద్వారం కావడంతో, ఆ ప్రాంతం పేరుతో ఇది బంగాళాఖాతంగా పిలవబడింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు బీచ్ అయిన కాక్స్ బజార్, అతిపెద్ద మడ అడవులూ బెంగాల్ పులికి సహజ ఆవాసమూ అయిన సుందర్బన్స్ బంగాళాఖాతం తీరం లోనే ఉన్నాయి.

Views: 263
  main(): 1x 0.26372599601746s
index: 1x 0.26315712928772s
t_/pages/daily-top-views: 1x 0.25652098655701s
t_/blocks/list: 1x 0.25087094306946s
router_page: 1x 0.0062870979309082s
t_/common/header: 1x 0.0010771751403809s
loading-2: 1.5x 0.0010461807250977s
t_/common/head: 1x 0.00084018707275391s
t_/common/footer: 1x 0.00014615058898926s
t_/content/select: 1x 5.6028366088867E-5s
----- END OF DUMP (2024-05-19 20:51:05) -----