Most viewed Wikipedia articles on March 3 , 2023
తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. దీనిని మాట్లాడే ప్రజలు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణాలో ఉన్నారు. ఇది ఆ రాష్ట్రాలలో అధికార భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు ఇది కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో ఇది ఒకటి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు నిస్తోంది. ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, వివిధ దేశాల్లో, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతుల్లో భాగమైంది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరిస్తారు.
అష్ట దిగ్గజాలు అంటే "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు" అని అర్థం. హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని ప్రతి. ఇవే అష్టదిగ్గజాలు. అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు.
హనుమాన్ చాలీసా,. ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు. తులసీదాసు ప్రసిద్ధ రచన రామచరితమానస. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది. దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి.
బలగం 2023లో విడుదలయిన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలైంది.
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల ఆశువుగా చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయల వారికి సలహాలు ఇచ్చే వాడు. అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఇతడు నంద వరీక బ్రాహ్మణుడు.
బచ్చుల అర్జునుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2017లో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
ఝాన్సీ లక్ష్మీబాయి pronunciation (help·info); నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం "జోన్ ఆఫ్ ఆర్క్" గా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్(నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రియైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీ కి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.
ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది.
రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. కాకతీయ గణపతిదేవుడు, పాలకుడైన జయాపసేనాని సోదరీమణులైన నారంభ, పేరాంభలను వివాహ మాడినాడు. వీరి ముద్దుల కుమార్తె రుద్రమదేవి. చేబ్రోలు శాసనం దీని గురించి తెలియజేస్తుంది. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవద్యపుర ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మ.
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు. రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. సా.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.
ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 పత్రిక అమ్మకాలతో దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
మనోజ్ గా అందరికీ సుపరిచితుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.
నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల!
మాదయ్యగారి మల్లన అష్టదిగ్గజములలో ఒకడు. 16వ శతాబ్దపు తెలుగు కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు.
రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది. ఒక గొప్ప ఆంధ్రకవి. ఈయన జన్మభూమి బల్లారికి సమీపము లోని పాలమండలము అను ప్రదేశంలో ఉండే భట్టుపల్లె. ఇతడు శాలివాహనశకము 13 వ శతాబ్ద మధ్యకాలమున జీవించి ఉన్నట్లు తెలుస్తున్నది. ఇతడు రచియించిన గ్రంథములు వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము. అందు మొదటిది రెండవదానివలె శుద్ధశ్లేషమయము కాకపోయినను శ్లేషనే అనుజీవించి ఉండును. దీనివలె కఠినశైలి కలదిఁయు మధురము అయినదియు అగు శ్లేషకావ్యము మఱియొక్కటి తెలుగులో లేదు. రెండవది కేవలశ్లేషమయమై హరిశ్చంద్రుని యొక్కయు నలుని యొక్కయు చరిత్రములను తెలుపుచు ఉంది. మూడవది కావ్యాలంకార లక్షణములను తెలుపునది. తెనుఁగునందు మేలైన అలంకార శాస్త్రము ఇది ఒక్కటే కనబడుతూ ఉంది. ఈతని కావ్యములు మిక్కిలి శ్లాఘనీయములుగా ఉన్నాయి. అయినను అవి ఇంచుక మతాంతరలక్షణమును తెలుపును. ఇతనికి రామరాజభూషణుఁడు, భట్టుమూర్తి అను బిరుదాంకము కృష్ణదేవరాయలచే ఇయ్యఁబడెను.
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించబడుతోంది. అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు.
కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే.
అయ్యలరాజు రామభద్రుడు 16 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈయన ఆంధ్ర భోజుడు,సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని భువనవిజయం లోని అష్ట దిగ్గజాల లో ఒకడు. ఈ విషయము పరిశోధనలో ఉంది. కానీ నిస్సంశయముగా వారికి సమకాలీనుడు.
తెలుగు భాష(నుడి)లో అక్షరములుు 60. వీటిని అచ్చులు, హల్లులు(మ్రోవలు), ఉభయాక్షరములుగా విభజించారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 56. 16 అచ్చులు, 41 హల్లులు(మ్రోవలు), (్) పొల్లు, సున్న, అఱసున్న, విసర్గ 60 అక్షరములు. అఱసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు భాగాలుగా విభజించవచ్చును.
భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.
సరోజినీ నాయుడు భారత కోకిల గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు.శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.
ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద్ద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులలో ఉంది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం.
భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. అతను 1992 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతం లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు సా.శ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది.. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాలనందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధం.
భారతదేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. చట్టం నిషేధించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇవి జరుగుతాయి.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.
ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. సా. శ. 2011 లో ఈ భూలోకం జనాభా 7 బిలియనులు (7,000,000,000) అయితే 5 బిలియనుల సెల్ ఫోనులు వాడకంలో ఉండేవిట! ప్రపంచవ్యాప్తంగా 1990 నుండి 2011 వరకు మొబైల్ ఫోన్ల వినియోగదారులు 12.4 మిలియన్ల నుండి 6 బిలియన్లకు ఎగబాకింది. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమనగా ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతీవ్యక్తికి ఈ మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి ప్రస్తుత సమాజంలో ఒక తప్పనిసరి సాధనం అయేయి.
తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.
హోలీ అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.
తిరుమల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తుంది, ఇది టిటిడి అధిపతిని కూడా నియమిస్తుంది, పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తుంది.
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు.
నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.
రామోజీరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఈనాడు ఈటీవీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ ను నడుపుతున్నాడు ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా షూటింగ్ ప్రాంతంగా పిలవబడే రామోజీ ఫిలిం సిటీ అధినేత
భూమా అఖిల ప్రియ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకురాలు. 2014 లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక, తెలుగు భాష, సంస్కృతి శాఖల మంత్రిగా పని చేసింది.. 2019 లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలోపోటీ చేసి, ఓడిపోయింది.
2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయింది. కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయా పథకాలకు జాబితాకు సంబంధించిన సమాచారం.
శ్రీకృష్ణదేవ రాయలు విజయనగర చక్రవర్తి. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు.
వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు.
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు.
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది.
ఆయుష్మాన్ భారత్ ఈ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు. ఈ పథకం పేదలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపు 10కోట్ల కుటుంబాల వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఈ పథకాన్ని మోదీకేర్‌గా అభివర్ణింస్తారు ఈ పథకం యొక్క తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2018న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ప్రారంభించారు.
మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేయు రసాయనములు, నలుసు పదార్థము లు, లేక జీవపదార్దము లు వాతావరణము లో కలియుట వాయు కాలుష్యము అనబడును.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది.
తిక్కన లేదా తిక్కన సోమయాజి. విక్రమసింహపురి పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
చాట్‌జిపిటి (ChatGPT) అనేది నవంబర్ 2022లో ఒపెన్‌ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది. ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్‌లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది. దాని అసమాన వాస్తవిక ఖచ్చితత్వం ఒక ముఖ్యమైన లోపంగా గుర్తించబడింది. ChatGPT విడుదలైన తర్వాత, OpenAI విలువ US$29 బిలియన్లు.
గౌతము బుద్ధుడు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు. 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ. 563 నుండి 483 మధ్యలో జననం అని, క్రీ.పూ 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మిగతా లెక్కలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.
గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పు లో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం ద్వారా, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు. గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితి మార్పు అనే మాటలను తరచూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతూంటారు. కానీ, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానంగా మానవుల వలన ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అది కొనసాగడం. శీతోష్ణస్థితిలో మార్పు అంటే గ్లోబల్ వార్మింగ్‌తో పాటు, దాని వలన అవపాతంలో ఏర్పడే మార్పులు కూడా చేరి ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ చరిత్ర-పూర్వ కాలాల్లో కూడా జరిగినప్పటికీ, 20 వ శతాబ్దం మధ్యకాలం నుండి జరిగిన ఉష్ణోగ్రతల పెరుగుదల, అంతకు ముందెన్నడూ జరగనివి.
నన్నయ భట్టారకుడు తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది.
సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.
వాతావరణం : : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు. ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.
జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మేషము, మీనము మొదలగు రాశులు.
రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు.
కాలుష్యం - మెర్రియం - వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువు నుండి తీసుకున్న వివరణ.]</ref> కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.కాలుష్యం తరచుగా మూల కేంద్ర కాలుష్యం లేదా మూల కేంద్రం లేని కాలుష్యం అని విభజింపబడుతుంది.
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
మార్చి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 62వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.
శోభా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలో 2012లో ఆమె రాజీనామా చేసిన వరకు నాలుగు సార్లు శాసన సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థలో చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆమె అంతకు పూర్వం తెలుగు దేశంపార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2012 లో ఆమె ప్రజారాజ్యం పార్టీని వీడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా ప్రముఖ రాజకీయనాయకులు. ఆయన రెండుసార్లు శాసనసభ్యునిగానూ, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగానూ పనిచేశారు. ఆమె కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసన సభ్యులు, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత.
జాతీయ భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించబడుతుంది. భద్రత, ఆరోగ్యం, వాతావరణం అంశాలపై కార్మికుల్లో అవగాహన కల్పించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సాధారణంగా ప్రతియేటా పరిశరమల్లో మార్చి 4న మొదలై మార్చి 10 వరకు జాతీయ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటారు.
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.
స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషను. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.
సంయుక్త మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, కన్నడ మరియు తెలుగు భాషా చిత్రాల్లో నటించింది.
తెలంగాణ ఉద్యమంభాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.
శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది.
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.
మార్చి 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 63వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 302 రోజులు మిగిలినవి.
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.
శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని, కోటిలింగాల, ధరణికోట, జూన్నార్ ల నుండి సా.శ..పూ. 230 సం. నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. శాతవానుల తొలి రాజధాని కోటిలింగాల. కాని కొందరు చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ఆంధ్రప్రదేశ్ లోని ధాన్యకటకం (అమరావతి) అని అభివర్ణిస్తున్నారు వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.
ఆటలమ్మ లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.
స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
నందమూరి తారకరత్న (1983, ఫిబ్రవరి 22 - 2023, ఫిబ్రవరి 18) తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు మనుమడు. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.
అల్లూరి సీతారామరాజు, భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యుడి తాలూకు విత్తనానికి జన్మనిచ్చేది పురుషుడే కాబట్టి, గోత్రం మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. గోత్రం అనగా గో అంటే గోవు, గురుడు, భూమి, వేదం అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.
కావ్య కళ్యాణ్‌రామ్ దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
"జాతీయములు " లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిగా అమెరికా అధ్యక్షుడు ప్రాంక్లిన్ డి. రూజ్వెల్డ్ సూచించారు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను జాన్ క్రిస్టియన్ రూపొందించారు ఈయన దక్షిణా ఆఫ్రికా కు చెందిన వారు
మదర్ థెరీసా, ఆగ్నీస్ గోక్షా బొజాక్షు, గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది..
శ్రీనాథుడు (1365–1441) 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు.
ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చెయ్యడం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భజలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు, తగినంతగా శుద్ధి చేయని మురుగునీటిని సహజ జలాల్లోకి విడుదల చేయడం జల పర్యావరణ వ్యవస్థల క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఈ నీటిపి ఆధారపడి నివసించే వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వారు అదే కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటిపారుదల కొరకు ఉపయోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వ్యాధులకూ నీటి కాలుష్యం ప్రధాన కారణం.
అమ్మఒడి, కె.సి.ఆర్. కిట్ పథకం తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.
జవాహర్ లాల్ నెహ్రూ, భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.